Hyd, May 17: బీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కీలక వ్యాఖ్కలు చేశారు. ఈ ఏడాది చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 95 – 105 స్థానాల్లో గెలువబోతుందని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. వందకు పైనే స్థానాలు బీఆర్‌ఎస్‌కు వస్తాయని జోస్యం పలికారాయన.
బుధవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ పదేళ్ల కాలంలో ప్రజలకు చేసింది చెప్పుకుంటే చాలూ. ఏం చేశామో జనాలకు చెప్పండి. గెలుపు మనదే అవుతుంది. రైతులను చెరువుల దగ్గరికి పిలిచి మీటింగ్ పెట్టండి. వాళ్లతో కలిసి భోజనాలు చేయండి. సరిపోతుంది. సిట్టింగ్‌లకే టికెట్లు ఉంటాయి. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కలుపుకొని పని చేయడంటూ ఈ సందర్భంగా మంత్రులకు క్లాస్ పీకారాయన.
జూన్ 12 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, టైం టేబుల్‌ను విడుదల చేసిన ఇంటర్మీడియట్ బోర్డు
దేశానికి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. అందుకే వాళ్ళని ప్రజలు నమ్మరు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 105 సీట్లు BRS కు వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఎవరు గెలిచినా పెద్ద విషయం కాదని వ్యాఖ్యానించారాయన. ఎన్నికల సమాయత్తంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడం పైనా చర్చించారు. మంత్రులు ఆయా జిల్లాలలో ఉత్సవాలు పర్యవేక్షించాలని ఆదేశించారాయన. జూన్ 2 నుంచి జరిగే సమావేశాలకు ఎమ్మెల్సీలను, ఎంపీలను పిలవండని మంత్రులకు సూచించారాయన. అలాగే.. ఆ 21 రోజులపాటు ప్రజల్లోనే ఉండాలని, పార్టీ ఎప్పటికప్పుడు అన్ని పరిణామాలను గమనిస్తుంటుందని సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఎక్కువ శాతం సీట్లు. నేను చెప్పినట్లు ఆచరిస్తే ప్రతి ఒక్కరికీ 50 వేల కన్నా అధిక మెజార్టీ వస్తుంది. పేదండ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిని చూసి దేశం తెలంగాణ మోడల్ కావాలని కోరుకుంటుంది. మహారాష్ట్రలోనూ ప్రజలు సైతం మనకు బ్రహ్మరథం పడుతున్నారంటే అందుకు మనం ఆచరించి చూపిన మోడలే అని బాగా గుర్తుంచుకోవాలి. కులం, మతంపై ఏ పార్టీ గెలవదు. అన్ని వర్గాలను సమాన దృష్టితో చూడడమే బీఆర్ఎస్ విజయ రహస్యం అని కేసీఆర్ పేర్కొన్నారు.