Hyd, Nov 29: వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. బాయిల్డ్ రైస్ కొనబోమని పూర్తిస్ధాయిలో కేంద్రం తేల్చిచెప్పిందని, రాష్ట్రం కూడా వరి ధాన్యం సేకరణ చేపట్టదన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని తేల్చిచెప్పారు. రైతులకు క్లియర్‌గా చెబుతున్నానని, కేంద్రం చేతులెత్తిసింది కాబట్టి యాసంగి పంటకు ఎట్టిపరిస్ధితుల్లోనూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. వర్షాకాలం పంట ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, వర్షాకాలం పంటకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం.. రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుపై తెలంగాణ కేబినేట్ భేటీ ముగిసిన తర్వాత ప్రెస్ మీట్‌లో మాట్లాడిన సీఎం.. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ఎండగట్టారు. 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్న బీజేపీ రైతు హంతకుల పార్టీ అని సీఎం కేసీఆర్ విమర్శించారు. మీది రైతు రాబందు పార్టీ. వాస్తవం కాదా.. 750 మంది చచ్చిపోలేదా. 13 నెలలు వాళ్లు ఎండనకా.. వాననకా.. కరోనాలో నిరసన చేస్తే.. అప్పుడు పట్టించుకోకుండా.. ఇప్పుడు మాట్లాడుతున్నారా? మేము రైతు బంధువులం.
మేము ప్రాజెక్టులు కట్టాం. ఎల్లంపల్లి, మిడ్ మానేరు, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిలసాగర్, దేవాదుల ప్రాజెక్టులు ఎవరు కంప్లీట్ చేశారు. అంతకుముందు ఈ ప్రాజెక్టులన్నీ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. వీళ్లు ముంచేవాళ్లు తప్పితే మంచి చేసేవాళ్లు కాదు. తెలిపోయింది. ఇది 100 శాతం రైతు వ్యతిరేక పార్టీ.. అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
దేశంలో ఆహార ధాన్యాలను సేకరించడం.. సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం.. అలాగే దేశ ఆహార భద్రత కోసం బఫర్ స్టాక్స్ నిలువ చేయడం సేకరించిన ధాన్యంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆహార కొరత ఏర్పడకుండా.. ఆహార రక్షణ కోసం ఫుడ్ సెక్యూరిటీ కోసం బఫర్ స్టాక్స్‌ను మెయిన్‌టెన్ చేస్తాయి. ఆ తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థకు ఆహార ధాన్యాలను అందించి నిరుపేదలకు అందించడం.. ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రాజ్యాంగ బద్ధంగా కేంద్రం మీద ఉన్న బాధ్యత అని సీఎం కేసీఆర్ అన్నారు.
ఈ దేశంలో రైతులకు, సామాన్యులకు, పేదలకు రక్షణ కావాలంటే దుర్మార్గమైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోవాల్సిందే : సీఎం కేసీఆర్@KTRTRS pic.twitter.com/3cbR52rdOs
— Jagan Reddy (@jaganreddy85) November 29, 2021
రాష్ట్ర ప్రభుత్వం తరుపున, రైతుల తరుపున.. మంత్రులు, ఎంపీలు, సీఎస్ వెళ్తే మీకు వేరే పనిలేదా.. అని కేంద్ర మంత్రి అన్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మంత్రులకు పనిలేక వెళ్తారా? ఇలాగేనా ఒక కేంద్ర మంత్రి మాట్లాడేది. రైతుల జీవితాలతో ఇలాగేనా చెలగాటం ఆడేది. తెలంగాణ రైతులను ముంచడానికే కేంద్రం చూస్తోంది. రేపు రైతు పంట పండిస్తడు.. వీళ్లు తీసుకోరు.. అప్పుడు ఏం చేయాలె రైతులు. బీజేపీ కన్నా తెలంగాణ ప్రభుత్వం కోటి రెట్లు మెరుగ్గా ఉంది. తెలంగాణలో అత్యధిక పంట పండిస్తున్నందుకు మీరు ఓర్వడం లేదు.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.