CM KCR (Photo-Video Grab)

Hyderabad, Nov 28: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం (Telangana Assembly Elections) నేటితో ముగియనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వానికి ముగింపుపడుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు నియోజకవర్గాలతోపాటు గజ్వేల్‌లో ప్రజా ఆశీర్వాద సభలు (Praja Ashirvada Sabha) నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీ మైదానంలో (KMC) ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరవుతారు. వరంగల్‌ పట్టణంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దాస్యం వినయ్‌ భాస్కర్‌, నన్నపునేని నరేందర్‌ తరఫున ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్‌ బయల్దేరుతారు. అక్కడ నిర్వహిచనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు.

Telangana Assembly Election: నేటితో తెలంగాణ ఎన్నికల ప్రచారం సమాప్తం.. సాయంత్రం 5 గంటలకు మూగబోనున్న మైకులు.. ప్రచారం ముగిసిన వెంటనే అమల్లోకి 144 సెక్షన్

హైదరాబాద్‌ మినహా..

నేటి ప్రచారంతో హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రచారం నిర్వహించినట్లవుతుంది. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడుతాయి.

Wine Shops Bandh: నేటి నుంచి వైన్స్‌ బంద్‌.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేటి సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేత