Warangal, June 21: వరంగల్ జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR Warangal Tour) పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేపడుతున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పలికారు.
అక్కడి నుంచి సెంట్రల్ జైలు మైదానంలో 24 అంతస్తులతో నిర్మించనున్న ఎంజీఎం మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి (MGM multi-super specialty hospital) సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ భవనాన్ని 6.73 ఎకరాల్లో 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. 2 వేల పడకల సామర్థ్యం, 35 సూపర్ స్పెషాలిటీ విభాగాలతో పూర్తి ఆధునిక వసతులతో ఆస్పత్రిని నిర్మించాలని సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయం తీసుకున్నారు.
అనంతరం కాళోజీ నారాయణ హెల్త్ వర్సిటీని సీఎం (Telangana Chief Minister K Chandrashekhar Rao) ప్రారంభించారు. వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్.. పూలమాల వేసి నివాళులర్పించారు. ఐదు ఎకరాల స్థలంలో రూ.25 కోట్లతో ఐదు అంతస్తులతో 69 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. అలాగే హన్మకొండలోని వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టర్ భవన సముదాయాన్ని ప్రారంభించారు.
Here's Telangana CMO Tweet
Live: CM Sri KCR laying foundation stone for Multi Super Speciality Hospital in Warangal https://t.co/HKqhBfPlny
— Telangana CMO (@TelanganaCMO) June 21, 2021
హన్మకొండలోని ఏకశిలా పార్కులో జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా సీఎం ఆయనను స్మరించుకున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతున్నదని, ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలకు నుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని సీఎం అన్నారు. ఒక్కొక్క రంగాన్ని సరిదిద్దుకుంటూ, దేశంలోని ఇతర రాష్ర్టాలతో అభివృద్ధిలో తెలంగాణ పోటీ పడుతూ, నూతన రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, తద్వారా ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళి అర్పిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.