Hyd, Feb 6: కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక సూచనలు చేశారు. పార్టీ గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. అలాగే ఎమ్మెల్యేలకు ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని అంతేగాని బహిరంగంగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో ముందుకు సాగాలని.. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠిన చర్యలు ఉంటాయని తేల్చిచెప్పారు(CM Revanth Reddy). పార్టీ విధానాలపై అనుమానాలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలి కానీ బహిరంగంగా ఎలాంటి విమర్శలు చేయొద్దుఅన్నారు. టీటీడీలో ఉద్యోగుల తొలగింపుపై ఓవైసీ..చంద్రబాబు పునరాలోచించాలని డిమాండ్, వక్ఫ్‌బోర్డులో నాన్ ముస్లింలను తొలగించాలని డిమాండ్
మెజారిటీ స్థానిక సంస్థలను ఏకగ్రీవం చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42% పదవులు ఇస్తామన్నారు. త్వరలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విధివిధానాలను వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం ఢిల్లీకి బయలు దేరారు.
తెలంగాణ ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ కుమార్ గౌడ్, డీప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ తో పాటు ఢిల్లీ వెళ్లారు నేతలు.రేపు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు రాష్ట్ర నేతలు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాల వారిగా ఆశావహుల జాబితా సిద్ధం చేశారు ఇంచార్జీ మున్షీ.