AP CM YS Jagan | File Photo

విజయవాడ, ఫిబ్రవరి 07: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ వెళ్లనున్నారు. రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలలో జగన్ పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి బయలు దేరి సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరకుంటారు. అక్కడి నుంచి నేరుగా ముచ్చింతల్ లోని చిన జీయర్ స్వామి ఆశ్రమానికి బయలుదేరి వెళతారు. నాలుగు గంటలు.... శ్రీరామనగరంలో జరిగే రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవల్లో జగన్ పాల్గొంటారు. దాదాపు నాలుగు గంటల పాటు జగన్ ఆశ్రమంలోనే ఉంటారు. 108 దివ్యాలయాను సందర్శిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 9.05 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. జగన్ పర్యటన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.