Cognizant to develop new centre in Hyderabad, create 15,000 jobs

. ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి డీ శ్రీధ‌ర్ బాబు త‌దిత‌రులు కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన చ‌ర్చ‌ల్లో రాష్ట్ర ప్ర‌భుత్వానికి, కాగ్నిజెంట్ సంస్థ మ‌ధ్య ఒప్పందం జరిగింది.

గతేడాది సీఎం బృందం దావోస్ పర్యటన సందర్భంగానే ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి.టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరించటం సంతోషంగా ఉందని కాగ్నిజెంట్ సీఈవో ఎస్.రవికుమార్ అన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది కంపెనీ. ఆగని లేఆప్స్, 1400 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న జర్మన్ చిప్‌మేకర్ ఇన్ఫినియన్

కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్‌ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాగ్నిజెంట్ కంపెనీకి తమ ప్రభుత్వం తగినంత మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని అన్నారు.ఇక్కడ కొత్త కేంద్రాన్నిస్థాపించాలనే కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ వృద్ధికి దోహదపడుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.