Hyderabad: జల్‌పల్లి మున్సిపాలిటీలోని షాహీన్‌నగర్‌లో శనివారం రాత్రి కాంగ్రెస్, ఏఐఎంఐఎం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. స్థానిక నివేదికల ప్రకారం, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడైన షేక్ యూసుఫ్ క్వాద్రీ, వర్షపు నీటితో నిండిన నబిల్ కాలనీకి వెళ్లి, ఆ ప్రాంతాన్ని పరిశీలించి, నివాసితులతో సంభాషించారు. అయితే, ఏఐఎంఐఎం పార్టీ స్థానిక నాయకులు అడ్డుకుని బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు.
“స్థానిక AIMIM కార్యకర్తలు మమ్మల్ని అడ్డుకున్నారు. ఆ ప్రాంతాన్ని మళ్లీ సందర్శించవద్దని బెదిరించారు. వారు మా అందరినీ బయటకు నెట్టారు. దీంతో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది, ”అని షేక్ యూసుఫ్ అన్నారు.
అయితే, కాంగ్రెస్ నాయకులు, అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలను రెచ్చగొట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని AIMIM కార్యకర్తలు ఆరోపించారు. సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతంలో పికెట్లు ఏర్పాటు చేశారు.