Mahesh Kumar Goud elects as Telangana Congress President

Hyd, Sep 6:  తెలంగాణ పీసీసీ చీఫ్‌గా నియమితులయ్యారు మ‌హేశ్ కుమార్ గౌడ్. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించగా రేవంత్ స్థానంలో పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు మహేశ్‌. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. పీసీసీ చీఫ్‌ పదవి కోసం మ‌ధుయాష్కీ గౌడ్, జీవ‌న్ రెడ్డి, జ‌గ్గా రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, అద్దంకి ద‌యాక‌ర్ పోటీ ప‌డ్డ తనకు అత్యంత సన్నిహితుడైన మహేశ్‌కు పదవి ఇప్పించడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు.

1966 ఫిబ్రవరి 24న నిజామాబాదు జిల్లా భీంగల్ మండలం, రహత్‌నగర్ లో జన్మించారు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్ధి విభాగం ఎన్‌ఎస్‌యూఐ నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ పెట్టింది పేరు, గ్లోబల్‌ ఏఐ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని వెల్లడి 

1994లో డిచ్‌పల్లి నుండి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2013 నుండి 2014 వరకు ఏపీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశారు. 2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనీ భావించిన ఆ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా నిలపడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు మహేశ్‌.