Congress MLA Aadi Srinivas sensational comments on KTR(X)

Hyd, December 20:   తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను ఏసీబీ అరెస్ట్ చేస్తే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని కేటీఆర్ అనుచరుడు శ్రీధర్ ఆదేశాలిచ్చినట్లు మాకు సమాచారం ఉందన్నారు.

ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు తగలబట్టి అల్లర్లు, దాడులు, ధర్నాలు చేసేందుకు సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు అని ఆరోపించారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.2 కోట్ల చొప్పున ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు డబ్బు పంపించారు అని...కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కన్నేసి ఉంచాలన్నారు.  ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం...తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారుల లేఖ, FIR కాపీతో పాటు నగదు బదిలీ వివరాలను అడిగిన ఈడీ 

కేటీఆర్ పై కేసు సక్రమమైన చర్యనే అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో ప్రతి రంగంలోనూ అవినీతి జరిగిందని...అందుకే ప్రజలు బీఆర్ఎస్ ను ఇంటికి పంపారు అన్నారు.

MLA Aadi Srinivas sensational comments on KTR

అధికారం కోల్పోయినా ఇంకా అదే అహంకారంతో కేటీఆర్ మాట్లాడుతున్నారు... కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పోవట్లేదు అన్నారు. అన్ని నిబంధనల మేరకే జరుగుతున్నాయని స్పష్టం చేశారు మహేష్ కుమార్ గౌడ్.