Damodar Rajanarasimha (Photo-Twitter/IANS)

Medak, July12: మెదక్ జిల్లా కేంద్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎడ్ల బండిపై నుంచి ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (Congress senior leader Damodar Rajanarasimha) జారీ కింద పడ్డారు. ఈ ఘటనలో ఆయన కాలికి స్వల్ప గాయం అయ్యింది. కాగా పెట్రో ధరల పెంపుపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

మెదక్ జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమానికి ఎడ్లబండ్లని ( bullock cart) ప్రదర్శనగా తీసుకొచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఎండ్లబండి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తన ప్రసంగంలో భాగంగా ‘జై కాంగ్రెస్.. జైజై కాంగ్రెస్’ అని నినాదాలు చేయడంతో ఎడ్లు ఒక్కసారిగా బెదిరాయి. దీంతో ఎండ్లబండి కుదుపులకు గురికావడంతో రాజనర్సింహ కిందపడిపోయారు. ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించడంతో మోకాలికి దెబ్బ తగినట్టు తెలుస్తోంది.

హుజురాబాద్‌‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ, రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి, ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కౌశిక్‌రెడ్డి ఆడియో

కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా వరంగల్, నిర్మల్, మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన (protest against fuel prices hike)కార్యక్రమాలు జరిగాయి. స్థానిక నాయకులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు.

Here's IANS Update

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ధర్నాచౌక్‌లో సైకిల్ ర్యాలీ, ఎడ్లబండితో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, గీతా రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఫిరోజ్ ఖాన్తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. అయితే వీరందర్నీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.