![](https://test1.latestly.com/wp-content/uploads/2020/08/cinima-Halls.jpg)
Hyd, Nov 24: తెలంగాణలో గత 24 గంటల్లో 921 కరోనా కేసులు (Covid in TS) నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,097 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,65,049కి (Coronavirus in TS) చేరింది.
ఇప్పటివరకు మొత్తం 2,52,565 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,437కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 11,047 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 8,720 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 146 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 61 కేసులు నిర్ధారణ అయ్యాయి.
కరోనా కారణంగా తెలంగాణలో 8 నెలలుగా సినిమా థియేటర్లు (Movie theatres) మూతపడ్డాయి. ప్రేక్షకులు వినోదానికి దూరమయ్యారు. ఇటీవల కరోనా తగ్గుముఖం పట్టింది. దీంతో ఆయా రంగాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో మూతపడిన సినిమా థియేటర్లు పునఃప్రారంభానికి (Movie theatres to open in TS) 50 శాతం సీటింగ్‌తో సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు.
మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. థియేటర్లలో టెంపరేచర్ 24 నుంచి 30 మధ్య ఉండేలా చూడాలని ఆదేశించారు. థియేటర్ల యాజమాన్యాలకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కూడా సీఎం కేసీఆర్ కల్పించారు.