Hyd, Sep 6: మేడిగడ్డ ఎఫెక్ట్ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది న్యాయస్థానం. 17న విచారణకు హాజరుకావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. కేసీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో ప్రజాధనం దుర్వినియోగమైందని రాజలింగమూర్తి కోర్టును ఆశ్రయించారు.
కేసీరా్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. కేసీఆర్ సహా మాజీ మంత్రి హరీష్ రావు, మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డి, ఎల్ అండ్ టీ ఎండీ సురేష్‌కుమార్, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. సెప్టెంబరు ఐదున హాజరుకావాలని ఆదేశాలిచ్చింది భూపాలపల్లి న్యాయస్థానం. దీంతో కేసీఆర్, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు నోటీసులు అందలేదని వారి తరపు న్యాయవాదులు న్యాయ స్థానానికి తెలిపారు. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ పెట్టింది పేరు, గ్లోబల్ ఏఐ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని వెల్లడి
మిగతా ఆరుగురు తరపు న్యాయవాదులు హాజరయ్యారు. దీంతో మరోసారి నోటీసులు జారీ చేయాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును అక్టోబరు 17 నాటికి వాయిదా వేసింది. అయితే గురువారం కోర్టుకు హాజరుకాని కేసీఆర్, స్మితాసబర్వాల్ 17న కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ మరోసారి సమన్లు జారీ చేశారు.