Close
Search

COVID In TS: కరోనా థర్డ్ వేవ్ మొదలైంది, తెలంగాణలో వచ్చే నాలుగు వారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంటా, బయటా మాస్క్‌ ధరించాలని తెలిపిన రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డా.శ్రీనివాసరావు

తెలంగాణలో కరోనాతో పాటు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే నాలుగు వారాలు కీలకమని (next four weeks will be crucial in the wake of the spread) రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డా.శ్రీనివాసరావు తెలిపారు. ఫిబ్రవరి నెల మధ్యలో కేసులు మళ్లీ తగ్గే అవకాశం ఉందని చెప్పారు.

తెలంగాణ Hazarath Reddy|

Telangana Director of Public Health, G Srinivasa Rao (Photo-ANI)

Hyd,Jan 6: తెలంగాణలో కరోనాతో పాటు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే నాలుగు వారాలు కీలకమని (next four weeks will be crucial in the wake of the spread) రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డా.శ్రీనివాసరావు తెలిపారు. ఫిబ్రవరి నెల మధ్యలో కేసులు మళ్లీ తగ్గే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైరస్‌ను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రజలందరికీ వైద్యారోగ్యశాఖ పలు సూచనలు చేస్తోందని.. వాటిని పాటించాలని డీహెచ్‌ (State Director of Public Health (DH) Dr Srinivasa Rao ) సూచించారు.

ప్రజలంతా తప్పనిసరిగా ఇంటా, బయటా మాస్క్‌ ధరించాలి. భౌతిక దూరం పాటించాలని కోరుతున్నాం. టీకా తీసుకోనివారు వెంటనే తీసుకోవాలి. న్యూ ఇయర్ నుంచి కేసులు (New variant Omicron along with Corona) పెరిగాయి. సంక్రాంతికి మరింతగా కేసులు పెరుగుతాయి. లక్షణాలుంటే సొంత వైద్యం చేసుకోకుండా తప్పక వైద్యులను సంప్రదించాలి. 2 కోట్ల కొవిడ్‌ పరీక్షలు, కోటికి పైగా హోం ఐసోలేషన్‌ కిట్లు సిద్ధంగా ఉంచాం. ర్యాపిడ్‌తో పాటు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు కూడా చేస్తున్నాం. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు.

తెలంగాణలో జనవరి ఒకటో తేదీ నుంచి కేసులు పెరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీలోనూ ఎక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. దీన్నే ముందుగానే గుర్తించాం. ప్రతి రోజు కొవిడ్‌పై సమీక్షలు చేపడుతున్నాం. రాష్ట్రంలో గత ఐదు రోజుల్లో నాలుగు రేట్లకు పైగా కేసుల పెరుగుదల నమోదైంది. పాజిటివిటీ రేటు కూడా 3శాతానికి పైగా ఉంది. కేసులు వేలాదిగా నమోదవుతున్నా తీవ్ర ప్రభావం లేదు. ఆస్పత్రుల్లో ఎక్కడా ఎక్కువ సంఖ్యలో రోగులు చేరడం లేదు. కొత్త వేరియంట్ బారిన పడిన వారు ఐదు రోజుల్లోనే కోలుకుంటున్నారు. జలుబు, స్వల్ప జ్వరం, తీవ్ర తలనొప్పి వంటి కొన్ని లక్షణాలు ఉన్నాయని అన్నారు.

కోవిడ్ కొత్త మార్గదర్శకాలు,ఇకపై హోం క్వారంటైన్‌‌లో ఏడు రోజులుంటే చాలు, కరోనా సోకిన 3 రోజులు జ్వరం రాకుంటే మాస్కుతో బయట తిరగవచ్చు, కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు ఇవే

డెల్టా వేరియంట్‌ పూర్తిగా తొలగిపోలేదని అన్నారు. ఇది సోకితే మూడు రోజుల తరువాత లక్షణాలు తీవ్రమవుతాయి. కొందరు స్వల్ప లక్షణాలున్నా భయంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇది సరైంది కాదు. భవిష్యత్తులో 90శాతం కేసులు ఒమిక్రాన్‌తోనే ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చిన ప్రొటోకాల్స్‌నే ప్రైవేటులో పాటించాలి. అనవసరంగా ప్రజలకు డబ్బు వృథా చేయవద్దు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనవసరంగా చికిత్స ఇస్తే చర్యలు తప్పవు. జనవరి 26 నాటికి వ్యాక్సిన్‌ రెండో డోస్‌ పూర్తి చేయాలని నిర్ణయించాం. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వారికి 10శాతం మందికి తొలి డోస్ ఇచ్చాం. విద్యార్థుల వద్దకే వెళ్లి టీకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

సిటీ పెట్రోల్ డీజిల్
View all
Currency Price Change