Cyberabad CP VC Sajjanar | Photo: ANI

Hyderabad, August 25: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ (Cyberabad CP Sajjanar) బదిలీ అయ్యారు. ఆయనను ఆర్టీసి ఎండీగా (Telangana RTC MD) నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సజ్జనార్‌ స్థానంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా 1999 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ముత్యాల స్టీఫెన్ రవీంద్రని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 3 ఏళ్లకు పైగా సైబరాబాద్ కమిషనర్‌గా సేవలు అందించారు. ఇక హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్ అనిల్ కుమార్ ను ఇంటెలిజెన్స్ ఛీప్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ సజ్జనార్‌ సంచలన కేసులు చేధించిన సంగతి తెలిసిందే. ఆయన 1996 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఇటీవలే ఆయన అడిషనల్ డీజీ ర్యాంకు ప్రమోషన్ పొందారు. వరంగల్ యాసిడ్ దాడి కేసులో ఎన్ కౌంటర్, శంషాబాద్ దిశ ఎన్ కౌంటర్‌లు సజ్జనార్‌ను దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచేలా చేశాయి. మల్టీ లెవెల్ స్కాములను ఛేదించడంలో సజ్జనార్‌కు మంచి పేరుంది. కరోనా సమయంలో ప్లాస్మా డొనేషన్‌లో విశేష సేవలు అందించారు.

రూ. 8 లక్షల లోపు ఆదాయం ఉంటే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం, ఎవరెవరు అర్హులనే దానిపై గైడ్‌లైన్స్ ఇవే

కీలకమైన కేసులను పరిష్కరించడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించి సజ్జనార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మహిళల రక్షణకు వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో సజ్జనార్ ఒక్కసారిగా సంచలనంగా మారారు. అంతకుముందు వరంగల్‌లో యాసిడ్ దాడి నిందితుడి ఎన్‌కౌంటర్‌తోనూ ఆయన గుర్తింపు పొందారు. సజ్జనార్ 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. కీలకమైన కేసులను కూడా పరిష్కరించిన ఐపీఎస్‌గా సజ్జనార్‌కు పేరుంది.

తెలంగాణలో నలుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతి లభించింది. ఐపీఎస్‌ అధికారులు అంజనీకుమార్‌, ఉమేశ్‌ షరాఫ్, గోవింద్‌ సింగ్‌, రవిగుప్త డీజీపీలుగా పదోన్నతి పొందారు. ఈ నలుగురు ఐపీఎస్‌లకు అదనపు డీజీ హోదా నుంచి డీజీపీ హోదా లభించింది.