Telangana Rashtra Samithi leader K Kavitha. (Credits: Facebook)

Hyd, Feb 5: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది.తుదివిచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోరారు. గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులు, రికార్డులను పరిశీలించాల్సి ఉందని పేర్కొంటూ జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం ఈ నెల 16కు విచారణ వాయిదావేసింది. అదే రోజున తుది విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవితకు మరోసారి ఈడీ నోటీసులు, రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపిన ఈడీ

ఈరోజు విచారణ సందర్భంగా ఈడీ నోటీసులకు కవిత (BRS MLC Kavitha petition) హాజరుకావడంలేదని అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ ​క్రమంలో ఈడీ నోటీసులను సవాల్‌ చేయడం వల్లే హాజరు కాలేదని కవిత తరఫు లాయర్‌ కపిల్‌ సిబల్‌ తెలిపారు. అనంతరం కోర్టు అభిషేక్‌ బెనర్జీ, నళిని చిదంబరం, కవిత కేసులను ఉమ్మడిగా విచారిస్తామని స్పష్టం చేసింది. ఈనెల 16వ తేదీన తుది వాదనలకు సిద్ధంగా ఉండాలని కోర్టు సూచించింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో (Delhi Liquor Scam Case) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కవితను పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. దీంతో, ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని పిటిషన​్‌ దాఖలు చేశారు.