Hyderabad, June30: తెలంగాణలో అధికార పార్టీ నేతలు కరోనా భారీన పడుతుండటం పార్టీలో కలవరం రేపుతోంది. ఇటీవల హోంశాఖ మంత్రి మమమూద్ అలీకి కరోనా సోకగా, తాజాగా తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు (Deputy speaker T Padma Rao) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. మూడు రోజుల నుంచి జ్వరం గొంతునొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. పద్మారావుతోపాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు సైతం కోవిడ్ బారిన పడ్డారు. వీరంతా ప్రస్తుతం సికింద్రాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. వీరిలొ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఇక తెలంగాణలో కరోనా (COVID-19) బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. టీఆర్‌ఎస్ పార్టీలో (TRS Party) ఇప్పటిదాకా కరోనా సోకిన నేతల్లో పద్మారావు అయిదవ వ్యక్తి. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేష్ గుప్తా, హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో చాలా మంది రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల ఇళ్లకే పరిమితమవుతున్నారు. తెలంగాణలో మరో 975 పాజిటివ్ కేసులు, రాష్ట్రంలో 15 వేలు దాటిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, 250 దాటిన కరోనా మరణాలు
ఇక సోమవారం ఒక్కరోజే తెలంగాణలో 973 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 15 వేలు దాటింది. మొత్తం 15,394 కేసులు నమోదవ్వగా 253 మంది మృత్యువాతపడ్డారు. కరోనాతో కోలుకున్న వారి సంఖ్య 5,582 ఉండగా.. ప్రస్తుతం 9,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి.