High Court of Telangana | (Photo-ANI)

Hyd, Feb 22: హైదరాబాద్‌ అంబర్‌పేట్‌ (Amberpet)లో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి ఘటనను హైకోర్టు (High Court) సుమోటోగా స్వీకరించింది. పేపర్ న్యూస్ ఆధారంగా కేసు (Dog Attack Boy Case) విచారణకు న్యాయస్థానం స్వీకరించింది. ఈ కేసుపై రేపు (గురువారం) హైకోర్టులో విచారణ జరుగనుంది.

హైదరాబాద్‌ అంబర్‌పేట ఛే నంబర్‌ చౌరస్తాలో ఆదివారం ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్‌ ను చుట్టుముట్టి పాశవికంగా కరిచి అతడి ప్రాణాలను బలిగొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీధి కుక్కలు బాలుడి తల, చేతులు, కాళ్లు, మెడ, పొట్ట భాగంలో తీవ్రంగా కరిచాయి.

షాకింగ్ వీడియో, నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి

చెయ్యి ఒకటి, కాలు మరో కుక్క పట్టి లాగాయి. తండ్రి గంగాధర్‌ వచ్చేవరకు దాడి చేస్తూనే ఉన్నాయి. ప్రదీప్‌ను సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు చెప్పారు. కార్ల సర్వీసింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు రూ.50 వేలు ఇవ్వడంతో గంగాధర్‌ కుటుంబం ప్రదీప్‌ అంత్యక్రియలు నిర్వహించింది.

కుక్కల దాడిలో చిన్నారి మృతిపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్, బిడ్డను తిరిగి తీసుకురాలేనని నాకు తెలుసు, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని వెల్లడి

ప్రదీప్‌ మృతిపై విచారణకు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి (Vijayalakshmi) విచారణకు ఆదేశించారు. ప్రదీప్‌ కుటుంబానికి జీహెచ్‌ఎంసీ తరఫున సాయం అందిస్తామన్నారు. అయితే ప్రదీప్‌పై దాడి చేసిన కుక్కలకు ఓ మహిళా రోజు మాంసం పెట్టేవారని, రెండ్రోజులుగా ఆమె లేకపోవడంతో వాటికి ఆహారం దొరకలేదని మేయర్ పేర్కొన్నారు. ఆ ఆకలితోనే దాడికి చేసి ఉండొచ్చని అన్నారు.ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పందంగా మారాయి.ఈ ఘటనతో జీహెచ్‌ఎంసీ (GHMC) వైఫల్యాన్ని కప్పిపుచ్చకోవడానికి ఆమె తాపత్రయం పడినట్లు కనిపిస్తుందేనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.