Hyd, Sep 13: తెలంగాణ వరద బాధితుల సహాయార్ధం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు ముందుకొచ్చి విరాళాన్ని అందివ్వగా తాజాగా రూ.5 కోట్లు విరాళం ఇచ్చింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ.
సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి.నారాయణరెడ్డి చెక్ అందజేశారు. అలాగే, సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళంగా వెస్టర్న్ కన్‌స్ట్రక్షన్స్ అందించింది. సీఎం రేవంత్ రెడ్డికి ఆర్.సుదర్శన్ రెడ్డి, ఏపీ సంజయ్ రెడ్డి చెక్ అందజేశారు.
వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 50లక్షల రూపాయల విరాళం అందించారు. బాలకృష్ణ తరపున ఆయన కూతురు తేజస్విని సచివాలయంలో సీఎంని కలిసి విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి విరాళం అందించిన వారిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కు ఏఎంఆర్ ఇండియా కోటి రూపాయల విరాళం, సీఎం రేవంత్‌ను కలిసి చెక్కు అందించిన కంపెనీ ఎండీ మహేష్ కుమార్
Here's Video:
వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు 50లక్షల రూపాయల విరాళం అందించారు. బాలకృష్ణ గారి తరపున వారి కూతురు తేజస్విని గారు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి విరాళం చెక్కును అందజేశారు. సహాయ… pic.twitter.com/j9f9PlsScW
— Telangana CMO (@TelanganaCMO) September 13, 2024
వరద బాధితుల సహాయార్థం వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి 1కోటి రూపాయల విరాళం అందించింది. కంపెనీ ప్రతినిధులు ఆర్.సుదర్శన్ రెడ్డి , ఏపీ సంజయ్ రెడ్డి సచివాలయంలో విరాళం చెక్కును అందజేశారు.
వరద బాధితుల సహాయార్థం ఏఎంఆర్ ఇండియా కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక కోటి రూపాయలు విరాళంగా అందించింది. కంపెనీ ఎండీ ఎ. మహేష్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి అందజేశారు. అలాగే,Woxsen యూనివర్సిటీ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందించింది. యూనివర్సిటీ వ్యవస్థాపకులు ప్రవీణ్ కె. పూల ముఖ్యమంత్రి ని కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు.
Here's Video:
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళంగా అందించిన వెస్టర్న్ కన్ స్ట్రక్షన్స్
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేసిన ఆర్.సుదర్శన్ రెడ్డి, ఏ.పీ. సంజయ్ రెడ్డి. pic.twitter.com/7Rh1uItQgF
— ChotaNews (@ChotaNewsTelugu) September 13, 2024