High Court of Telangana | (Photo-ANI)

నగరంలో గణేష్‌ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్యాంక్‌ బండ్‌లో పీవోపీ విగ్రహాల నిమజ్జనం (Ganesh Immersion) చేయొద్దని తెలంగాణ హైకోర్టు మరోసారి తేల్చి చెప్పింది. కృత్రిమ కొలనుల్లోనే పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయాలని ఆదేశించింది. గతంలో ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకొని అమలు చేయాలని నగర సీపీని ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేసి నివేదిక సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

కేసీఆర్‌ సర్కార్‌కు మళ్లీ షాకిచ్చిన తెలంగాణ గవర్నర్‌, ఎమ్మెల్సీల కోటాలో ప్రభుత్వం పంపిన సిఫార్సులను తిరస్కరించిన తమిళిసై సౌందరరాజన్‌

పీవోపీ విగ్రహాలన్నింటిని జీహెచ్ఎంసి ఏర్పాటు చేసిన కృత్రిమ తాత్కాలిక నీటి కుంటలలో నిమజ్జనం చెయ్యాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులను యధాతథంగా అమలు చేయాలని నగర సీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేసింది. గత వాదనల సమయంలోనే(సెప్టెంబర్‌ 8).. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ (పీవోపీ)తో తయారు చేసిన గణేశ్‌ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయరాదని .. ఈ విషయమై గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొంది హైకోర్టు.