CM KCR And Guv Soundararajan (Photo-File Image)

Hyd, Sep 25: తెలంగాణలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేసీఆర్‌ ప్రభుత్వం మధ్య వ్యవహారం ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా గవర్నర్‌ తమిళిసై ఎమ్మెల్సీల కోటాలో ప్రభుత్వం పంపిన సిఫార్సులను గవర్నర్‌ తిరస్కరించారు. దీంతో, తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది.

వివరాల ప్రకారం.. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై.. కేసీఆర్‌ సర్కార్‌కు మళ్లీ షాకిచ్చారు. రాష్ట్రంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్‌ తిరస్కరించారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన సిఫార్సులను తమిళిసై తిరస్కరించారు. ఇక, అంతకుముందు కూడా గవర్నర్‌ తమిళిసై ఎమ్మెల్సీ కోటా కింద పాడి కౌశిక్‌ రెడ్డి విషయంలో కూడా ప్రభుత్వ సిఫార్సులను కొద్దిరోజులు హోల్డ్‌లో పెట్టిన విషయం తెలిసిందే.

దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం.. కేసీఆర్‌పై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు.. ఆరు నెలలుగా అపాయింట్‌ మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ అవమానిస్తున్నారని ఆవేదన

ఈ సందర్బంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మాట్లాడుతూ.. దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కళలు, సాహిత్యం, సైన్స్‌ రంగంలో వీరిద్దరూ పెద్దగా కృషి చేయలేదు. గవర్నర్‌ కోటాలో నామినేట్‌ చేసే అర్హతలు వీళ్లకు లేవు. ఆర్టికల్‌ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదు అని అన్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దాసోజు శ్రవణ్‌ ఇటీవలే బీజేపీలో చేరారు. అనంతరం, కొన్ని పరిణామాల నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిపోయారు.