 
                                                                 Hyd, July 19: తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. అదే విధంగా 33 జిల్లాలకు డిస్ట్రిక్ ఎలక్టోరల్ అధికారులను సైతం నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు, స్కూల్స్ మూతపడే అవకాశం, పలు ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్
కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం హైదరాబాద్ ఎన్నికల అధికారిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ నియామకమయ్యారు. మిగతా 32 జిల్లాలకు కలెక్టర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించనున్నారు. 119 నియోజకవర్గాలకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులుగా అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, ఐటీడీఏ పీవోలు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు వ్యవహరిస్తారని ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
