Hyd, July 19: ఒడిశాను ఆనుకొని ఉన్న జార్ఖండ్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉప రితల ఆవర్తనం కొనసాగు తోంది. దీని ప్రభావంతో తెలంగాణలో బుధ, గురువారా ల్లో అనేకచోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని హైదరాబాద్ వాతా వరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది.వచ్చే మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలలు కూడా మూతపడే అవకాశం ఉంది. అయితే, రాష్ట్ర లేదా స్థానిక పరిపాలన ఇప్పటి వరకు పాఠశాల మూసివేతపై ఎటువంటి నవీకరణను జారీ చేయలేదు.
తెలంగాణ పాఠశాలలు మూసివేయబడ్డాయా లేదా ఇతర విద్యాసంస్థల అప్‌డేట్ ఇప్పటి వరకు జారీ చేయబడలేదు. అయితే, ప్రతికూల వాతావరణ పరిపాలనను పరిగణనలోకి తీసుకుని ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలు మరియు కళాశాలలను మూసివేయడానికి కాల్ తీసుకోవచ్చు. నవీకరణల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు సంబంధిత పాఠశాలలను సంప్రదించాలని సూచించారు.రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. సీజన్‌లోనే అత్యధికంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజులో 21 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో గరిష్ఠంగా 98.4 మిల్లీమీటర్ల వర్షం పడింది. నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది.
ఖమ్మం, నాగర్‌కర్నూల్, గద్వాల, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఓ మోస్తరు వాన పడింది. కాగా.. వానలు పడుతున్నా, ఇంకా వర్షపాతం లోటులోనే ఉంది. ఈ సీజన్‌లో మంగళవారం నాటికి 251.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 217.1 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది. అంటే 14 శాతం లోటు ఉంది. 19 జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదు కాగా.. 14 జిల్లాల్లో కొరత ఉంది.
వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం ఆసిఫాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని IMD తెలిపింది.
ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతిభారీ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడే వీలుందని వాతావరణ శాఖ పేర్కొంది.
మరో వైపు గత 24 గంటల్లో ములు గు జిల్లా వెంకటాపూర్, తా డ్వాయి, ఏటూరు నాగారం, గోవిందరావుపేట, వెంకటాపు రంలలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా పేరూరు, హనుమకొండ జిల్లా పరకాలలో 8 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. రేగొండ, ఎల్లారెడ్డిపేట, భీంగల్, ఆత్మకూరు, గంగాధర, చొప్పదండి, చందుర్తి, ములుగు, హుజూరాబాద్, చిట్యాల, శాయంపేటల్లో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. మంగళవారం ఉదయం నుంచి అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాలు
మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం
భారీ నుంచి అతిభారీ వర్షాలు
సిద్దిపేట, జనగాం, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి.
భారీ వర్షాలు..
ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి
మోస్తరు నుంచి భారీ వర్షాలు..
హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాలు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.