
Hyderabad, April 10: ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేపట్టింది. ఉదయం నుంచి ఒకేసారి 10 ప్రాంతాల్లో సోదాలు (Ex-minister Naini Narsinghareddy’s house raided) నిర్వహించింది. ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. దివంగత మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయిని వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ముకుంద రెడ్డి, దేవికా రాణి, ఇతర నిందితుల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగాయి. నాయిని కుమారుడు దేవేందర్‌రెడ్డి, అల్లుడు శ్రీనివాస్‌రెడ్డిని ఈడీ విచారించింది. నాయిని నర్సింహారెడ్డి మాజీ పీఎస్ ముకుంద రెడ్డి ఇంట్లో ఈడీ (Enforcement Directorate) సోదాలు నిర్వహించింది.
ప్రస్తుతం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దగ్గర పీఏగా ముకుందరెడ్డి పని చేస్తున్నారు. అలాగే మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఇతర నిందితుల ఇళ్ళల్లోనూ ఈడీ సోదాలు చేపట్టింది. ఈఎస్‌ఐ స్కామ్‌లో మనీ లాండరింగ్ పాల్పడినట్లు ఈడీ కేసు నమోదు చేసింది. దేవికారాణి మనీ ల్యాండరింగ్ పాల్పడినట్లు ఆధారాలు ఉండగా, ఇప్పటికే 25 మంది అరెస్ట్ చేసింది.
Here's ANI Update
Enforcement Directorate seized cash worth Rs 3 cr, jewellery worth Rs 1 cr, blank cheques, property papers & digital devices from residences of Srinivas Reddy (son-in-law of former Telangana HM Naini N Reddy) & his associates. Searches underway at 7 locations.
(Pic source: ED) pic.twitter.com/A9UMnPWeps
— ANI (@ANI) April 10, 2021
సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణంలో వైద్య కిట్లు, మందుల కొనుగోళ్ల వ్యవహారంలో నకిలీ బిల్లులు సృష్టించి రూ.6.5 కోట్లు కుంభకోణం జరిగినట్టు ఏసీబీ గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌లో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా తొమ్మిది మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
స్కామ్‌కు పాల్పడి విదేశాలకు నగదు బదిలీ చేసినట్టు ఏసీబీ గుర్తించింది. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలు సేకరించింది. విదేశాలకు నగదు బదిలీ చేసిన నేపథ్యంలో దర్యాప్తు చేయాలని ఈడీకి ఏసీబీ లేఖ రాసింది. ఏసీబీ అధికారులు రాసిన లేఖ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా నేడు 10 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది.