Khammam, AUG 25: గోదావరి జలాలతో మీ పాదాలు కడిగేదాకా రాజకీయాల్లో ఉంటానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Ngeswara Rao) తన అనుచరుల్ని ఉద్దేశించి భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా ప్రజల కోసం తాను పోటీ చేసి తీరతానని తుమ్మల (Thummala Ngeswara Rao) ప్రకటించారు. శుక్రవారం భారీ కాన్వాయ్‌తో ఖమ్మంలో ఆయనకు ఘన స్వాగతం పలకగా.. ఊహాగానాలకు తెర తీస్తూ ఎన్నికల్లో పోటీపై ప్రకటన చేశారు. శ్రీ రాముడి ఆశీస్సులు తో పది నియోజకవర్గం లో అందరు చిరు నవ్వు తో బతకాలని 40 సంవత్సరాలు పాటు అందిరికి సౌకర్యాలు కోసం జీవితాన్ని త్యాగం చేశా. మొన్న ఎన్నికల సమయంలోనే జిల్లాతో రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలనుకున్నా. రాజకీయాలకు స్వస్తి చెబుతానని సీఎంకు కూడా చెప్పాను. కానీ, మీ ఆందోళన, అభిమానం చూశాక మనసు మార్చకున్నాను.
Thummala #Nageswara Rao took out a huge rally in #Khammam and showed his strength.
Thummala #Nageshwar Rao Former #BRS Minister likely to join #Congress Party along with his Supporters, Big boost for #Congress Party in #Khammam.#TelanganaElections2023 pic.twitter.com/HT6vmALSQT
— Arbaaz The Great (@ArbaazTheGreat1) August 25, 2023
నాగలి దున్నుకునే వాడిని ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిని చేశారు. మూడు ప్రభుత్వాలలో నాకు అవకాశం ఇచ్చారు. నాకు కష్టం వచ్చిన ప్పుడు నన్ను కాపాడారు. గోదావరి జలాలు (Godavari water) తో మీ పాదాలు కడిగేంత వరకు ఎంఎల్ఏ గా ఉంటా. నా చేతులతో పాలేరు , వైరా, బేతుపల్లి లో కానీ ఉమ్మడి జిల్లాలో నింపి మీకు దూరం అవుతా. మీ కోసమే రాజకీయ జీవితం తప్ప.. నాకు పాలిటిక్స్ అవసరం లేదు. నాకు పదవి అధిపత్యం కోసం కాదు. నన్ను తప్పించానని కొందరు శునకానందం పొందుతున్నారు. ఎవరినీ నిందించను. నా శిరస్సు నరుక్కుంటా తప్పా.. నా కోసం ఎవరూ తలవంచొద్దు. ఎక్కడా తలవంచేది లేదు. అందుకే మీ కోసమే ఎన్నికల్లో నిలబడుతున్నా. మీ కీర్తి కోసం ఆత్మాభిమానం కోసం నిలబడుతా. నన్ను మీ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారనే మీ ముందుకు వస్తున్నా. అసలైన పనులు పూర్తి చేసి .. మీతో శెభాష్ అనిపించుకుంటా అని అనుచరుల్ని ఉద్దేశించి పేర్కొన్నారాయన.
అయితే తన ప్రకటనలో ఎక్కడా బీఆర్‌ఎస్‌పైగానీ.. కేసీఆర్‌పైగానీ అసంతృప్తి వ్యక్తం చేయని తుమ్మల.. పార్టీ మార్పుపై నుంచి గానీ, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే(పాలేరు నుంచేనా) అనే దానిపైనా స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.