Hyd, Sep 5: ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈడీ అధికారులు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. మంత్రి గంగుల కుటంబ సభ్యులకు చెందిన శ్వేతా గ్రానైట్స్ ఏజెన్సీలో అవకతవకలను ఈడీ గుర్తించింది. గత ఏడాది నవంబర్‌లో శ్వేతా ఏజెన్సీస్‌లో సోదాలు నిర్వహించింది.
చైనాకు గ్రానైట్స్ మెటీరియల్ ఎగుమతి చేయటంలో అక్రమాలు జరిగినట్టు తేల్చింది. విజిలెన్స్ రిపోర్టు ప్రకారం 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్‌ను అక్రమంగా తరలించినట్లు నిర్ధారించింది. అంతేకాదు.. గ్రానైట్స్ ఎగుమతి ద్వారా ఈ ఏజెన్సీస్ ఫెమా నిబంధనల్లో రూ.4.8 కోట్ల మోసానికి పాల్పడినట్లు గుర్తించింది. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులో సుమారు రూ. 50 కోట్ల వరకు పెండింగ్‌లో ఉండగా.. కేవలం రూ. 3కోట్లు మాత్రమే చెల్లించింది శ్వేతా ఏజెన్సీస్. మరోవైపు హవాలా మార్గంలో డబ్బు ట్రాన్స్‌ఫర్ అయ్యినట్టు ఈడీ ఆధారాలు సేకరించినట్లు సమాచారం.