Fish Prasadam (Credits: Twitter)

Hyderabad, June 9: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) తరఫున ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న చేప మందును (Fish Medicine) తీనేందుకు దేశ వ్యాప్తంగా జనం ముఖ్యంగా అస్తమా రోగులు (Asthma) పోటెత్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వేదికగా బత్తిన కుటుంబం ఏటా చేప ప్రసాదం పంపిణీ (Fish Medicine Distribution) చేస్తోంది. ఈ దఫా వివిధ రాష్ట్రాల నుంచి చేప మందు కోసం వస్తున్న వారి సంఖ్య క్షణ క్షణం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో ఎగ్జిబిషన్ ప్రాంతంలో ఏటూ చూసినా కిక్కిరిసిన జనమే దర్శనమిస్తోంది. నాంపల్లి ఎంజే మార్కెట్, రైల్వేస్టేషన్ తదితర చోట్ల తరుచూ ట్రాఫిక్ తీవ్ర రద్దీ ఏర్పడుతోంది. నేటి ఉదయం 8 గంటలకు చేప మందు పంపిణీ మొదలైంది. దీనికోసం అధికార యంత్రాంగం ఇప్పటికే సర్వం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఏర్పాట్లను శరవేగంగా జరుగుతున్నాయి. తమకు కట్టబెట్టిన బాధ్యత లు, పనులను అధికారులు సమన్వయంతో దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Lucknow Horror: యూపీలో దారుణం, బాలికను సుత్తితో కొట్టి రక్తం కారుతుంటే ఆ రక్తంలోనే అత్యాచారం, ఆపై మృతదేహానికి ఉరివేసిన మైనర్ బాలుడు

మొబైల్ ఇస్తామంటూ రూంకి పిలిచి దారుణంగా అత్యాచారం, నొప్పి అంటూ అరుస్తున్నా నోరు మూసి పని కానిచ్చిన కామాంధులు

ప్రత్యేక కౌంటర్లు

సుమారు 90 వేల పైగా చేపలను అందించేందుకు సర్కార్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఈసారి మాత్రం దాదాపు 3 లక్షల మంది వరకు జనం రావచ్చని ఎగ్జిబిషన్ సొసైటీ అంచనా వేస్తుంది. మైదానం లోపల ప్రత్యేక షెడ్లలలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన జనం రెండురోజులుగా బస చేస్తున్నారు. అంతేకాకుండా అనేక మంది ప్రజలు నాంపల్లి ఇతర చోట్ల ధర్మ సత్రాలు, తమ బంధుమిత్రుల ఇళ్లలోను, లాడ్జింగ్‌లో ఇప్పటికే దిగారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు తలెత్తకుండా వివిధ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకుంటున్నారు. సుమారు వెయ్యిమంది పైగా పోలీసులతోపాటు ప్రత్యేక బలగాలను మోహరించారు.

ముంబైలో దారుణం, మద్యం మత్తులో ఉన్న మగ ప్రయాణికుడిపై ఆటోడ్రైవర్ అత్యాచారం, ఛార్జీ డబ్బులు ఇవ్వలేదని పొదల్లోకి లాక్కెళ్లి మరీ దారుణం

ఏయే రాష్ట్రాల నుంచి అంటే?

ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, యూపీ తదితర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశీయులు కూడా చేప మందు పట్ల ఆసక్తి చూపుతున్నారు.

ముంబైలో దారుణం, మద్యం మత్తులో ఉన్న మగ ప్రయాణికుడిపై ఆటోడ్రైవర్ అత్యాచారం, ఛార్జీ డబ్బులు ఇవ్వలేదని పొదల్లోకి లాక్కెళ్లి మరీ దారుణం

జనానికి ఫలహారాలు

చేప ప్రసాదాన్ని తీసుకొనేందుకు వస్తున్న వేల సంఖ్యలో జనానికి ఆకలి, దాహార్తి వంటి సమస్యలు లేకుండా సేవా సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చాయి. ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.