DS Health Condition: పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స
పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) ఆరోగ్యం పరిస్థితి విషమంగా మారింది. కొంతకాలంగా డీఎస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు.
Hyderabad, Sep 12: పీసీసీ (PCC) మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) (DS) ఆరోగ్యం (Health) పరిస్థితి విషమంగా మారింది. కొంతకాలంగా డీఎస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన బీపీ లెవెల్స్ (BP Levels) పడిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా, పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. సెప్టిక్ షాక్‌తో పలు అవయవాలు సరిగా పనిచేయడం లేదని హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు.
కుమారులు ఏమన్నారంటే?
ఐసీయూలో ఉంచి డీఎస్ కు వైద్యులు చికిత్స చేస్తున్నారని, వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారని ఆయన తనయుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ తెలిపారు. ఇదే విషయాన్ని చిన్న కుమారుడు, ఎంపీ ధర్మపురి అర్వింద్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
(The above story first appeared on LatestLY on Sep 12, 2023 09:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

