Hyderabad, July 12: తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్. రమణ టీఆర్‌ఎస్‌లోకి (Former Telangana TDP leader L Ramana joins TRS ) చేరారు. ఆ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందజేశారు. కాగా, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ( former TDP State president L Ramana) పార్టీకి గుడ్‌బై చెప్తూ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తన రాజీనామా లేఖను జూలై 9 న శుక్రవారం మీడియాకు విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని లేఖలో పేర్కొన్నారు.
లేఖలో ఎల్. రమణ 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పడిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు రోజు జులై 8న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఎల్.రమణ భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా టీఆర్ఎస్‌లోకి రావాలసిందిగా కేసీఆర్ ఆయన్ను ఆహ్వానించారు. పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇఛ్చారు. ఆ భేటీ జరిగిన మరుసటి రోజే టీడీపీకి గుడ్‌బై చెప్పారు.
కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎల్.రమణకు మంచి పట్టుకుంది. ఇక టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన ఆయన స్థానాన్ని భర్తీ చేసే బలమైన బీసీ నాయకుడి కోసం సీఎం కేసీఆర్ అన్వేసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎల్. రమణ వైపు కేసీఆర్ మొగ్గుచూపారు. అంతేకాదు అవసరమైతే హుజురాబాద్ ఎన్నికల్లో బరిలోకి దింపాలని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈటల బీసీ నాయకుడు కావడంతో మరో బీసీ నాయకుడిని బరిలోకి దింపితేనే బాగుంటుందని యోచిస్తున్నారని సమాచారం.
Here's TRS Party Tweet
మాజీ తెలంగాణ టీడీపీ అధ్యక్షులు శ్రీ ఎల్.రమణ గారికి టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందజేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS. pic.twitter.com/zBVNsRZ5EH
— TRS Party (@trspartyonline) July 12, 2021
బీసీ నాయకునిగా కరీంనగర్ పార్లమెంటు నుంచి సీనియర్ అయిన చొక్కారావును ఓడించి సంచలనం సృష్టించారు. జగిత్యాలలో జీవన్ రెడ్డిని మట్టి కరిపించి చంద్రబాబు హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జగిత్యాల నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడు. చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటు అయిన రమణ రాష్ట్ర పునర్విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రమణ పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. కేడర్ కూడా లేదు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్ దృష్ట్యా టీఆర్ఎస్‌లోకి వెళ్లాలని రమణ నిర్ణయించుకున్నారు.