Hyderabad, Dec 3: తెలంగాణ (Telangana), చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ (Madhyapradesh), రాజస్థాన్ (Rajasthan), మిజోరంలో శాసనసభ ఎన్నికలు జరగ్గా మిజోరం సహా మిగతా నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో జోరు చూపించేదెవరన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? మ్యాజిక్ ఫిగర్ ఎంత?? అనే చర్చ జరుగుతున్నది. 119 అసెంబ్లీ స్థానాలు ఉన్న తెలంగాణలో అధికారంలోకి రావాలంటే 60 సీట్లు తప్పనిసరి.
ఇక 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్ లో అధికారానికి రావాలంటే 116 సీట్లు అవసరపడుతాయి. రాజస్థాన్ లో మొత్తం 200 స్థానాలకు గాను 199 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక్కడ అధికారాన్ని చేపట్టాలంటే కనీసం 100 స్థానాల్లో గెలువాల్సి ఉంటుంది. చత్తీస్‌గఢ్ లో మొత్తం 90 స్థానాలుండగా 46 స్థానాలు గెలిచిన వారికే అధికారం కైవసం అవుతుంది.