Hyd, July 6: ఘట్ కేసర్ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల నుంచి చిన్నారిని పోలీసులు రక్షించారు. సీపీ ఫుటేజ్ ఆధారంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిందితుడు సురేష్, చిన్నారిని గుర్తించారు. వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. పసికందును ఇతర ప్రాంతాలకు విక్రయించేందుకు సురేష్ ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో బుధవారం రాత్రి నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.మేడ్చల్‌లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటూ చిన్నారి కనిపించికుండా పోయింది.
బాలిక కృష్ణవేణి రాత్రి షాప్‌కు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఎంత వెతికినా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలిక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించి, కిడ్నాపర్ నుంచి పాపను కాపాడారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గంటల వ్యవధిలోనే పోలీసులు చిన్నారిని సురక్షితంగా కాపాడారు.
Here's CC TV Visuals
ఘట్‌కేసర్‌లో నాలుగు సంవత్సరాల బాలిక కృష్ణవేణి కిడ్నాప్
నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో కిరాణా షాప్‌లోకి వెళ్లిన చిన్నారి , తిరిగి ఇంటికి రాలేదు.
సీసీ కెమెరాలో సురేష్ మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి వద్ద పాప ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కొనసాగుతున్న గాలింపు… pic.twitter.com/Gda52Non1O
— Telugu Scribe (@TeluguScribe) July 6, 2023
సీసీటీవీ ఫుటేజీలో మతిస్థిమితం లేని వ్యక్తి సమీపంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు సురేష్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. రాత్రి 8 గంటల సమయంలో సురేష్ కిరాణా దుకాణం దగ్గరకు వచ్చినట్లు సమాచారం. అదే సమయంలో పాప చాక్లెట్ కొనేందుకు వెళ్లింది. సురేశ్, పాపను తీసుకెళ్లడం చూసిన స్థానికులు పోలీసులకు తెలిపారు. సురేష్ గతంలో కాలేజీలో పనిచేస్తున్నప్పుడు, సినిమా థియేటర్‌లో పని చేస్తూ అమ్మాయిలను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఏపీకి తీసుకెళ్లేవాడని దర్యాప్తులో తేలింది.