Gaddar (Photo-Video Grab)

తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ చేరింది. తూటాల వంటి పాటలతో ప్రజల్లో విప్లవ స్ఫూర్తిని రగిలించిన, ప్రజాగాయకుడు గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రజా గాయకుడు గద్దర్‌ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. కొత్త పార్టీగా ‘గద్దర్‌ ప్రజా పార్టీ’ పేరును విప్లవ సింగర్ అనౌన్స్‌ చేశారు.

ఈ క్రమంలో గద్దర్‌ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఎన్నికల కార్యాయాలనికి గద్దర్ చేరుకున్నారు. రాజకీయ పార్టీ ‘గద్దర్‌ ప్రజా పార్టీ’ రిజిస్ట్రేషన్‌ కోసం ఎన్నికల అధికారులను కలిశారు గద్దర్‌. దీంతో, తెలంగాణలో పాలిటిక్స్‌ చర్చనీయాంశంగా మారాయి. గద్దర్ ప్రజా పార్టీ జెండాలో మూడు రంగులు, మధ్యలో పిడికిలి ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గద్దర్ తన ప్రయాణాన్ని ఎరుపురంగుతో ప్రారంభించారు. గద్దర్ మొదటగా అంబేద్కరిస్టు.. కాలానుగుణంగా ఆయన వామపక్ష రాజకీయాలపై ఆకర్షితులయ్యారు. అందుకే నీలి రంగు కూడా జెండాలో తప్పకుండా ఉంటుందని భావిస్తున్నారు.

ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ, జై తెలుగు పేరుతో పార్టీని ప్రారంభించిన సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం

పార్టీ అధ్యక్షుడిగా గద్దర్, కార్యదర్శిగా నరేశ్, కోశాధికారిగా గద్దర్ భార్య నాగలక్ష్మి వ్యవహరించబోతున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత గద్దర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది.పాటతోనే ప్రస్థానాన్ని ప్రారంభించి.. పాటతోనే ప్రజా ప్రస్థానాన్ని ముగిస్తానని చెప్పిన గద్దర్ అని పిలువబడే గుమ్మడి విఠల్ రావు ఇప్పుడు కొత్త పార్టీకి అంకురార్పణ చేస్తున్నారు