Hyderabad, FEB 11: బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ (Bonthu Rammohan) సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ ను వీడి త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి జీహెచ్ఎంసీ మేయర్ గా పని చేశారు బొంతు రామ్మోహన్. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ (BRS) పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా నేతలంతా పార్టీని వీడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల చాలా మంది బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితి ఉంది. అయితే, గెలిచిన వారంతా అధికార కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది.
BRS leader and former Hyderabad Mayor Bonthu Rammohan met Telangana Chief Minister and TPCC Chief Revanth Reddy at his residence today. pic.twitter.com/lQBX7m4cP2
— ANI (@ANI) February 11, 2024
రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో (Mahender Reddy) పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన జెడ్పీ ఛైర్ పర్సన్ గా ఉన్న ఆయన భార్య సునీతా మహేందర్ రెడ్డి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ ను కలిశారు. చేవెళ్ల పార్లమెంట్ టికెట్ కు సంబంధించి హామీ లభించడం వల్ల వారంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు అనే ఊహాగానాలు వినిపడుతున్నాయి. త్వరలోనే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. తనతో పాటు కొందరు ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ లోకి తీసుకెళ్లేందుకు మహేందర్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు ఎక్కువమంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వారంతా అధికార కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. గ్రేటర్ లో బలమైన నేతలు కాంగ్రెస్ పార్టీకి క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. తాజాగా హైదరాబాద్ మేయర్ గా పని చేసిన బొంతు రామ్మోహన్.. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఆయన కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన భార్య ప్రస్తుతం కార్పొరేటర్ గా ఉన్నారు. ఆమె కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత జీహెచ్ఎంసీ తొలి మేయర్ గా పని చేసిన వ్యక్తిగా బొంతు రామ్మోహన్ గుర్తింపు పొందారు. అదే విధంగా జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ గా పనిచేసిన బాబా ఫసియుద్దీన్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు.