మద్యం అమ్మకాలపై దృష్టి సారించిన ప్రభుత్వం.. బీర్ బాటిల్ పై రూ.20-30 వరకూ తగ్గించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నిత్యావసర వస్తువులతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు పెరుగుతున్నప్పటికీ, మద్యంపై 17 శాతం కోవిడ్ సెస్‌ను తొలగించడం ద్వారా బీర్ ధరలను తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా.. గతేడాది జూలైలో బీర్ ధరపై రూ.10 తగ్గించగా.. అమ్మకాలు పెద్దగా పెరగలేదు.ఫలితంగా గోడౌన్లలో నిల్వలు పెరిగిపోయాయి.
వేసవిలో మద్యం అమ్మకాలు జోరుగా సాగనున్న నేపథ్యంలో.. వేసవికి ముందే బీరు ధరలను తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీరు ధర రూ.180 నుంచి రూ.200 ఉండగా.. ప్రభుత్వం ఆ ధరలను రూ.20 నుంచి రూ.30 వరకూ తగ్గించవచ్చని అంచనా.