Telangana Tourism: తెలంగాణ పర్యాటకులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల 2 నుంచి నాగార్జునసాగర్ – శ్రీశైలం లాంచీ ప్రయాణం.. వివరాలు ఇవిగో..!
తెలంగాణలోని టూరిజం అందాలను చూడాలనుకొనే పర్యాటకులకు గుడ్ న్యూస్. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం ప్రారంభం కానున్నది.
Hyderabad, Oct 27: తెలంగాణలోని టూరిజం (Telangana Tourism) అందాలను చూడాలనుకొనే పర్యాటకులకు గుడ్ న్యూస్. నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) నుంచి శ్రీశైలం (Srishailam) వరకు లాంచీ ప్రయాణం ప్రారంభం కానున్నది. నవంబర్ 2 నుంచి ఈ లాంచీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్టు పర్యాటక అభివృద్ధి సంస్థ, వాటర్ ఫీడ్ జీఎం ఇబ్రహీం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు 984854037 1, 98481258720, 79979510 23 నంబర్లలో సంప్రదించాలన్నారు.
లాంచీ ప్రయాణ రుసుము ఇలా..
వన్‌వే లాంచీ ప్రయాణానికి..
- పెద్దలకు రూ.2 వేలు
- పిల్లలకు రూ.1,600
రానుపోను లాంచీ ప్రయాణానికి..
- పెద్దలకు రూ.3వేలు
- పిల్లలకు రూ.2,400
(The above story first appeared on LatestLY on Oct 27, 2024 11:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

