Hyderabad, SEP 25: హైదరాబాద్ విపత్తు నిర్వహణ-ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ (Hydraa)కు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం (Government Order) ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రాలో కొత్తగా వివిధ కేటగిరిల్లో 169 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ విభాగాల్లో డిప్యూటేషన్‌పై సిబ్బంది నియామకం (Saff For Hydraa) చేపట్టింది. కాగా, హైడ్రాకు పూర్తిస్థాయి స్వేచ్ఛ కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Here is the Tweet
Telangana Govt sanctions 169 new posts in HYDRAA office
Government of #Telangana on Wednesday has approved the creation of 169 new posts across various categories in the Commissioner of #HYDRAA @Comm_HYDRAA office, #Hyderabad
Roles include a Commissioner, Police Inspectors,… pic.twitter.com/lE49TYNA3q
— Deccan Chronicle (@DeccanChronicle) September 25, 2024
ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, రెవెన్యూ, నీటిపారుదల తదితర శాఖలకు ఉన్న విశేష అధికారాలను హైడ్రాకు ఇవ్వాలని నిర్ణయించింది.