Hyd, Sep 4: ఖమ్మం వరద బాధితులకు అండగా నిలిచింది బీఆర్ఎస్. వరద బాధితులను ఆదుకోవాలన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాం అని తెలిపారు మాజీ మంత్రి హరీశ్ రావు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన సహాయక చర్యలు చేపట్టింది. అందుకు తోడుగా బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యుల ఒక నెల జీతాన్ని వారికి అందించనున్నాం అని తెలిపారు.
ప్రజల కష్టాల్లో తోడుండే బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కూడా విలయం సృష్టించిన విపత్తులో ప్రజలతో ప్రజల పక్షాన నిలబడిందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తను గాయపర్చింది హరీశ్ రావు కారే, కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ట్వీట్ వైరల్, కారు నడిపింది పాడి కౌశిక్ రెడ్డి అని వెల్లడి
Here's Harishrao Tweet:
వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాం.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ… pic.twitter.com/xlccVloT0P
— Harish Rao Thanneeru (@BRSHarish) September 4, 2024
భారీ వర్షాలతో మున్నేరు వాగుకు వరద పెరిగి దానవాయిగూడెం, రామన్నపేట, మోతీనగర్, వెంకటేశ్వరనగర్, రంగనాయకులగుట్ట, ప్రకాష్‌నగర్, బొక్కలగడ్డ, పద్మావతినగర్ ప్రాంతాలు పూర్తిగా నీటమునిగిపోయాయి. గతంలో ఎప్పుడూ ఖమ్మంలో ఇలాంటి పరిస్థితులు కనిపించలేదు. మున్నేరు తీవ్రంగా ప్రవహించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారీ వర్షాలతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.