Harishrao participates new year celebrations at Siddipet Gurukulam(X)

Siddipet, January 1:  సిద్ధిపేట అర్బన్ మండలం తడకపల్లి బీసీ హాస్టల్లో న్యూ ఇయర్ వేడుకలలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నూతన సంవత్సర వేడుకలు విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు హరీశ్‌ రావు.

6 నెలల నుండి కాస్మోటిక్ చార్జీలు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయే అని తెలుసుకోవడానికి వచ్చాను అన్నారు. మీకు మెస్, కాస్మోటిక్ చార్జీలు రాకపోవడం బాధాకరం.... అసెంబ్లీ లో చెప్పిన మెనూ వేరే ఉంది హాస్టల్ లో వేరే ఉందన్నారు.విద్యార్థులు ధరించే దుస్తులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు అన్నారు.

మీకు సంబంధించిన సమస్యల పైన ప్రభుత్వంలో ఉన్న వారితో మాట్లాడి అమలు అయ్యేలా చేస్తాను.... నూతన సంవత్సరం అంటే విందు వినోదాలు కాకుండా ఉండాలి అని హాస్టల్ విద్యార్థులకు అవసరమైనవి ఇవ్వాలి అని చెప్పడంతో కార్యకర్తలు అందరు ముందుకు రావడం సంతోషం అన్నారు.

విద్యార్థులు డ్రగ్స్, అన్లైన్ గేమ్స్ బారిన పడకుండా ఉండాలి... మీరు మంచిగా చదువుకోని తల్లితండ్రుల గౌరవం కాపాడాలన్నారు. మిమ్మల్ని చెడు వ్యసనాల వైపు మళ్లించడానికి చాలా మంది చూస్తుంటారు మీరు వాటికి దూరంగా ఉండాలి... మీకు తెలిసిన వారు కూడా ఎదైనా మాదకద్రవ్యాలు తీసుకుంటున్నట్టు తెలిస్తే మీ సార్లకు చెప్పాలన్నారు.  2025లో ప్రజలందరికీ మంచి జరగాలి..నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణ భవన్‌లో క్యాలెండర్ ఆవిష్కరించనున్న కేటీఆర్ 

ఇటీవల ఆన్ లైన్ గేమ్ ఆడి ఇద్దరు కానిస్టేబుల్ లు ఆత్మహత్య చేసుకున్నారు. మీరు ఆన్ లైన్ గేమ్స్ బారిన పడకూడదు.. మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ , అబ్దుల్ కలామ్ లాంటి వారు వీధి దీపాల కింద చదువుకోని పైకి వచ్చారు అన్నారు. మీరు ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటూ మీ సమయాన్ని వృధా చేయకుండా ఉండాలి అని కోరుకుంటున్నా... 10 వ తరగతి విద్యార్థులు బాగా చదవండి... ఉజ్వల భవిష్యత్ పది నుండే ప్రారంభం అవుతుందన్నారు.

ప్రత్యేక తరగతుల్లో నా స్వంత ఖర్చులతో స్నాక్స్ ఏర్పాటు చేపిస్తా..- 10/10 సాధించిన విద్యార్థులకు ఐ ప్యాడ్ గిఫ్ట్ గా ఇస్తానన్నారు. డాక్టర్ చదవాలి అనుకునే విద్యార్థులను నేను చదివిస్తా.. అందరూ బాగా చదివి పేరు తెచ్చుకోవాలన్నారు.