Heavy Rain in HYD: హైదరాబాద్‌లో ఈదురుగాలులతో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌తో సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు
Weather report: Heavy rains likely in Andhra Pradesh for next two days (Photo-Twitter)

Hyderabad, May 3: హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలుచోట్ల ఉరుములు.. ఊదురుగాలులతో కూడిన భారీ వర్షం (Heavy Rain in HYD) కురిసింది. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి, నారాయణగూడ.. కాచిగూడ, అబిడ్స్‌, కోఠి, ట్యాంక్‌బండ్‌, నాంపల్లి, ఖైరతాబాద్‌.. కూకట్‌పల్లి, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్టలో భారీ వర్షం పడింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. సిద్ధిపేటలో గాలి వర్షానికి ( Suddenly Heavy Rain In Hyderabad) కౌంటింగ్ కేంద్రం వద్ద టెంట్లు కుప్ప కూలాయి.

గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌సిటీ, నిజాంపేట్, కూకట్‌పల్లి, మణికొండ, ఫిలింనగర్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌, షేక్‌పేట, టోలిచౌకి, ఎస్సార్‌‌నగర్‌, పంజాగుట్ట, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడ, అబిడ్స్‌, కోఠి, ట్యాంక్‌బండ్‌, నాంపల్లి, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, చాదర్ ఘాట్, మలక్ పేట్, సైదాబాద్, మాదన్నపేట, రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ , బండ్లగూడా జాగీర్లతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

నగరంలో పడిన భారీ వర్షానికి ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు వరద కాలువలుగా మారిపోయాయి. వర్షం ధాటికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు వరద కాలువలుగా మారిపోయాయి. ఈదురుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షం ధాటికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కాగా, గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలతో సతమతమవుతున్న హైదరాబాద్ నగర ప్రజలు ఈ వర్షాలతో కొంత చల్లబడ్డారు. అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌తో సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఒకటి రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.