Nagarjuna Sagar, NOV 30: నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద (Nagarjuna Sagar Dam) ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్ వద్దకు ఏపీ పోలీసులు (AP Police) చేరుకున్నారు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంలో (Water Fight) వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, సాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు రాగా.. తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. బుధవారం సాయంత్రం నుంచి గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీగా ఏపీఎస్పీ పోలీసులను మోహరించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు 13వ నంబర్ గేటు వద్ద ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. డ్యామ్‌లో మొత్తం 26 గేట్లు ఉన్నాయి.
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉద్రిక్తత
ప్రాజెక్టు దగ్గరకు భారీగా చేరుకున్న ఏపీ పోలీసులు
నీటిని విడుదల చేసేందుకు సిద్ధమైన ఏపీ అధికారులు
సాగర్ దగ్గరకు చేరుకున్న తెలంగాణ పోలీసులు
ఏపీ పోలీసులను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు#NagarjunaSagar #Telangana #AndhraPradesh pic.twitter.com/2tSFwlpW61
— 🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 (@dmuppavarapu) November 30, 2023
అర్ధరాత్రి సమయంలో దాదాపు 700మంది పోలీసులు సాగర్ డ్యామ్‌పైకి (Nagarjuna Sagar Dam) చేరుకోగా.. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇరువైపులా భారీగా పోలీసులను మోహరించారు.
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తతపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసేందుకు రాత్రికి రాత్రే నీటి కోసం గొడవ సృష్టించారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.