Representative Photo

Hyd, May 15: కేంద్ర ఇంటిలిజెన్స్‌ సమాచారంతో ఉగ్రవాదా మూలాలను ఏరి పారేసేందుకు మధ్యప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌(ఏటీఎస్‌), తెలంగాణ కౌంటర్‌ ఇంటిలిజెన్స్‌ జాయింట్‌ ఆపరేషన్‌ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు హిజబ్ ఉట్ తెహ్రిర్ సంస్థతో సంబంధాలున్న ఉగ్రవాదులు హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలడంతో అధికారులు దీనిపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో అరెస్ట్, న్యూస్ ఛానల్ ఉద్యోగి అరవింద్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ, రూ.17 కోట్ల నగదు లావాదేవీలు జరిపినట్లు వెల్లడి

ఈ టెర్రర్ ముఠా మధ్యప్రదేశ్‌, హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో ఉగ్రదాడులకు పాల్పడే కుట్రలు జరుగతున్నట్లు అనుమానాలు రావడంతో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. దీనికి సంబంధించి ఇటీవలే హైదరాబాద్‌లో ఆరుగురు, భోపాల్‌లో 11 మందిని అరెస్టు చేశారు. తాజాగా మరో ఇద్దర్ని బాబానగర్‌, చంద్రాయన్‌ గుట్టలలో అదుపులోకి తీసుకున్నట్లు ఏటీఎస్‌ అధికారులు వెల్లడించారు. దీంతో అరెస్టయిన నిందితుల సంఖ్య 19కి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.