Home Minister Amit Shah (Photo Credit: ANI)

HYD, April 21: తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్బంగా బీజేపీ తలపెట్టిన చేవెళ్ల సభలో పాల్గొంటారు. అలాగే, నోవాటెల్‌ హోటల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ టీంతో అమిత్‌ షా సమావేశం కానున్నారు. కాగా అమిత్‌షా తెలంగాణ పర్యటన అటు రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ పెంచబోతోంది.

వాతావరణ శాఖ గుడ్ న్యూస్, కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తేలికపాటి వానలు కురిసే అవకాశం

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్, ఇతర చిన్నపార్టీలు ప్రచార దూకుడు పెంచాయి. ఇలాంటి సమయంలో 23న చేవెళ్ల సభలో అమిత్‌షా ఏం మాట్లాడుతారనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను సవాల్‌ చేస్తూ.. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేలా ఈ సభ ఉండొచ్చని బీజేపీ అధికార వర్గాలు చెప్తున్నాయి.

అమిత్‌ షా తెలంగాణ షెడ్యూల్‌ ఇదే..

- ఆదివారం(23న) మధ్యాహ్నం 3.30 గంటలకు అమిత్‌ షా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

- మధ్యాహ్నం 3.50 గంటలకు నోవాటెల్‌ హోటల్‌కు వెళ్తారు.

- సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీంతో సమావేశం అవుతారు.

- సాయంత్రం 4.30 గంటల నుంచి 5.10 గంటల వరకు బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం అవుతుంది.

- సాయంత్రం 5.15 గంటలకు అమిత్‌ షా చేవెళ్ల సభకు బయలుదేరుతారు.

- సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు అమిత్‌ షా బహిరంగ సభలో పాల్గొంటారు.

- తిరిగి రాత్రి 7.45 గంటలకు అమిత్‌ షా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఢిల్లీకి పయనమవుతారు.