
Hyd, Mar 6: మందుబాబులకు అలర్ట్. హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో (Hyderabad) రెండు రోజులపాలటు మద్యం దుకాణాలు (Wine shops) బంద్ కానున్నాయి. రాచకొండ కమిషనరేట్ (Rachakonda commissionerate) పరిధిలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్లను మూసివేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
శాంతిభద్రతలకు భంగం కలుగకుండా షాపులు మూసేయాలని ఇప్పటికే వైన్స్ నిర్వాహకులను ఆదేశించామని పోలీసు అధికారులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా మందుతాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రాచకొండ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రతీ ఏటా మద్యం దుకాణాలను ముందుగానే మూసేస్తారు.ఈ ఏడాది కూడా షాపులను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు.