Suryapet, Jan 27: సూర్యాపేటలో (Suryapet) పరువు హత్య కలకలం సృష్టించింది. వడ్లకొండ కృష్ణ (మాల బంటి) అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. మామిళ్లగడ్డలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి బాడీని జనగామ రహదారి నుంచి పిల్లలమర్రికి వెళ్లే మూసీ నది కట్టపై విసిరేశారు. బాధితుడిని బండరాళ్లతో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆరు నెలల కిందట కృష్ణ ప్రేమ వివాహం చేసుకొన్నట్టు సమాచారం.
కారణం అదేనా??
వివాహానికి సంబంధించిన పాత కక్షలే కృష్ణ హత్యకు దారి తీసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరువు హత్యగా (Honor Killing) భావిస్తున్నారు. కాగా కృష్ణ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు సమాచారం.
హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం, మంటల్లో రెండు బోట్లు, ప్రమాద సమయంలో బోట్స్‌లో 15 మంది