Hyderabad Gang-Rape Case: బాలికపై సామూహిక అత్యాచారం కేసు, 4గురికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు, ఎమ్మెల్యే కుమారుడికి బెయిల్ నిరాకరణ
Representational Image (Photo Credits: File Image)

Hyd, July 27: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో (Hyderabad Gang-Rape Case) నిందితులైన నలుగురు మైనర్లకు బెయిల్ లభించింది. అమ్నేషియా పబ్ నుంచి బయటకు వచ్చిన మైనర్ బాలికపై వీరంతా సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. మే 28న జూబ్లీహిల్స్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. 17 ఏళ్ల అమ్మాయిపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల్లో ఒక ప్రజాప్రతినిధి కుమారుడు కూడా ఉన్నాడు. ఒక్కొక్కరికి (4 Accused) రూ. 5 వేల పూచీకత్తుతో పాటు పోలీసులు విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలనే షరతుపై కోర్టు బెయిల్ (Get Bail) మంజూరు చేసింది. ఎమ్మెల్యే కుమారుడికి జువైనల్ బోర్డు (Juvenile court) బెయిల్ నిరాకరించింది. నిందితుల్లో ఏకైక మేజర్ అయిన సాదుద్దీన్ మాలిక్ కు కోర్టు బెయిల్ నిరాకరించడంతో అతను చంచల్ గూడ జైల్లోనే ఉన్నాడు.

అంతా ముందుగానే ప్లాన్.. ఒకరి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారం, జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక అ‍త్యాచార కేసు వివరాలను వెల్లడించిన సీపీ సీవీ ఆనంద్

ఈ కేసులో రాజకీయ నేతల పిల్లలు ఉండటంతో పోలీసులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కీలక ఆధారాలను సేకరించారు. దాదాపు 400 పేజీల ఛార్జ్ షీట్ ను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ కేసులో ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నివేదిక, సీసీ కెమెరా ఫుటేజీలు, మొబైల్ డేటా కీలకం కానున్నాయి.గతంలో రెండు సార్లు బెయిల్‌ కోసం పిటిషన్ వేయగా...జువెనైల్ కోర్ట్ రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లో మరో దారుణం, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ బాలికపై 5 మంది అత్యాచారం, కార్ఖానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లిదండ్రులు

ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే కుమారుడికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మొదట జువెనైల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఎమ్మెల్యే కుమారుడు హైకోర్టులో అప్పీలు చేసుకున్నాడు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున ఇంకా జైల్లోనే ఉన్నాడు.