Hyderabad, Jan 4: హైదరాబాద్ (Hyderabad) శివారుల్లోని మేడ్చల్ లో (Medchal) దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న అనురాగ్ రెడ్డి హాస్టల్ లో ఉంటూ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్న మహేందర్‌రెడ్డి(38)ని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. మహేందర్ స్నేహితుడు, క్యాబ్ డ్రైవర్ అయిన కిరణ్ రెడ్డి ఈ హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. హాస్టల్ ఓనర్ పద్మతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తుంది.
రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, భూ సేకరణపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష
బాయ్స్ హాస్టల్ లో స్నేహితుడిని హతమార్చిన క్యాబ్ డ్రైవర్
కత్తితో పొడిచి మహేందర్ రెడ్డి (38)ని హత్య చేసిన కిరణ్ రెడ్డి
మహేందర్ రెడ్డి, కిరణ్ రెడ్డి ఇదే హాస్టల్ లో ఉంటూ క్యాబ్ నడిపేవారు
హాస్టల్ లో ఉండే మహిళతో వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్న పోలీసులు pic.twitter.com/0RI8pJ42hz
— BIG TV Breaking News (@bigtvtelugu) January 4, 2025
హాస్టల్ వద్దు అంటూ..
అనురాగ్ హాస్టల్ లో యువకులంతా మద్యం సేవించి ఎప్పుడు ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటారని స్థానికులు ఆరోపించారు. ఈ ప్రాంతం నుంచి హాస్టల్ తీసేయాలని స్థానికులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.