Mohammad Nooruddin, 51-Year-Old Man from Hyderabad passed 10 exam. (Photo Credits: ANI)

Hyderabad, July 31: కరోనావైరస్ చాలామందిని ఇబ్బందులకు గురి చేసినా కొంతమందికి మేలే చేసింది. ముఖ్యంగా విద్యార్థలకు ఈ విషయంలో చాలా మేలు చేసిందని చెప్పవచ్చు. అయితే ఈ కోవిడ్-19 (COVID-19 situation) 55 ఏళ్ల వ్యక్తికి కూడా సంతోషాన్ని నింపింది. 33 సంవత్సరాలుగా 10వ తరగతి పరీక్ష (10th class examination) పాస్ అవడానికి నానా తంటాలు పడుతున్న మొహమ్మద్ నూరుద్దీన్ (Mohammad Noorudin) వ్యక్తికి 10 పాసయ్యేలా చేసింది. వ్యాక్సిన్ వచ్చే దాకా పోరాడాల్సిందే, దేశంలో 16 లక్షలు దాటిన కరోనా వైరస్ కేసుల సంఖ్య, ఒక్కరోజు 6,42,588 కరోనా పరీక్షలు నిర్వహణ

ఘటన వివరాల్లోకెళితే.. తెలంగాణలో నివాసం ఉంటున్న మొహమ్మద్ నూరుద్దీన్ అనే 51 సంవత్సరాల వ్యక్తి గత 33 ఏండ్లుగా 10వ తరగతి పరీక్షా పాస్ అవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఎప్పుడూ పాస్ కాలేదు. అయితే ఈ సారి కరోనావైరస్ (Coronavirus pandemic) దెబ్బకి తెలంగాణ ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసి అందర్నీ పాస్ చేయడంతో ఇతను కూడా పాసయ్యాడు. 33 ఏండ్లుగా 10వ తరగతిపైన నూరుద్దీన్ చేస్తున్న పోరాటంలో అంతిమంగా కరోనా సాయంతో విజయం సాధించాడు.

Here's ANI Tweet

1987లో నూరుద్దీన్ తొలిసారి 10వ తరగతి పరీక్షలు రాసాడు. అప్పటినుండి 33 సంవత్సరాల కాలంలో అనేకసార్లు రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలను రాసాడు. ప్రతీసారి ఇంగ్లీష్ పరీక్షే తన వీక్ పాయింట్ అంటున్నాడు. 2019 వరకు ఈ 33ఏండ్ల కాలంలో ఎంత కష్టించి చదివినా 30 నుంచి 33 మార్కుల మధ్య మాత్రమే వస్తున్నాయి తప్ప, ఎప్పుడు పాస్ అవలేదు అంటున్నాడు. 35 మార్కుల పాస్ మార్కు గీతను చేరుకోవడంలో వరుస వైఫల్యాలను ఎదుర్కున్నట్టుగా చెప్పాడు.

ఇక ఈ సంవత్సరం రెగ్యులర్ ఎగ్జామ్స్ దాటిపోవడంతో ఓపెన్ లో కట్టాడు. అన్ని సబ్జెక్టులుమరల రాయాలని చెప్పినప్పటికీ... ఎలాగైనా 10వ తరగతి పరీక్షలో పాస్ అవ్వాలని నిశ్చయించుకున్న నూరుద్దీన్ ఫీజు కట్టి హాల్ టికెట్ కూడా తెచ్చుకున్నాడు. ఇక కరోనా దెబ్బకు పరీక్షలు వాయిదా పడడం, అందరిని పాస్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో తన కలను నిజం చేసుకున్నాడు. తనను పాస్ చేసినందుకు కేసీఆర్ కి ధన్యవాదాలు కూడాచెబుతున్నాడు.