Hyd, January 2: ప్రజలకు నూతన సంవత్సరం కానుకగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం వెలువరించారు. మెట్రో విస్తరణ పై నిర్ణయం తీసుకున్నారు. నూతన సంవత్సర కానుకగా శామీర్ పేట్, మేడ్చల్ వరకు మెట్రో విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు. జేబీఎస్ నుండి శామీర్ పేట్ (22 కిలోమీటర్లు) , ప్యారడైజ్ నుండి మేడ్చల్ (23 కిలోమీటర్లు) మెట్రో విస్తరణ చేపట్టాలన్నారు. మెట్రో రైల్ ఫేజ్ -2 'బి' భాగంగా డీపీఆర్ తయారు చేయాలని మెట్రో అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ప్యారడైజ్-మేడ్చల్, జేబీఎస్-శామీర్‌పేట ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్. మూడు నెలల్లో డీపీఆర్ తయారు చేయాలని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని రేవంత్ ఆదేశించారు. సీఎం రేవంత్ ప్రకటనపై హర్షం వ్యక్తమవుతోంది. మరోసారి విదేశాలకు సీఎం రేవంత్ రెడ్డి, ఆస్ట్రేలియా- సింగపూర్‌లో పర్యటించనున్న సీఎం బృందం..క్రీడా ప్రాంగణాలు పరిశీలన
హైదరాబాద్‌కు ఉత్తర ప్రాంతంలో ఉన్న ప్యారడైజ్ నుంచి తాడ్‌బండ్-బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్-మిలిటరీ డెయిరీ ఫామ్ రోడ్డు-కొంపల్లి-మేడ్చల్ వరకు (22 కిలోమీటర్లు), జేబీఎస్ నుంచి శామీర్‌పేట్-తూముకుంట వరకు (19 కిలోమీటర్లు), తార్నాక నుంచి ఈసీఐఎల్-నాగారం-కీసర వరకు (20 కిలోమీటర్లు), బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ నుంచి మూసాపేట్ వై జంక్షన్-బాలానగర్-సూరారం-గండిమైసమ్మ వరకు (21 కిలోమీటర్లు) మెట్రో కారిడార్లను నిర్మించాలని డిమాండ్ ఉంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించిన ప్రకటన చేయడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.