Hyderabad Gang Rape Case: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌పై కేసు, కాంగ్రెస్ ఎందుకు ఉలిక్కిపడుతుందో చెప్పాలని తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే, కేసును లీగల్‌గా ఎదుర్కునేందుకు సిద్ధమని వెల్లడి
BJP Raghunandan Rao (Photo-Twitter)

Hyd, June 8: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి విదితమే. జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో (Hyderabad Gang Rape Case) ఫోటోలు, వీడియోలు బహిర్గతం చేయడంపై ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై అబిడ్స్‌ పోలీసులు కేసు (Case filed against Raghunandan Rao) నమోదు చేశారు. ఐపీసీ 228(a) సెక్షన్‌ కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి తనపై పెట్టిన కేసులను లీగల్‌గా ఎదుర్కొంటానని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌ రావు తెలిపారు.

నోటీసులు ఇచ్చినా, పోలీసులు అరెస్ట్‌ చేసేందుకు వచ్చినా సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. పార్టీ కార్యాల యంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. న్యాయం జరిగే దాకా బాధితురాలి పక్షాన పోరాడతానని స్పష్టం చేశారు.ఈ కేసులో కాంగ్రెస్‌ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అమ్నీషియా పబ్‌ మైనర్‌ అమ్మాయి కేసులో కాంగ్రెస్‌ నేతల పిల్లలు కూడా ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనలో నిందితులకు శిక్ష పడే వరకు బండి సంజయ్‌ నేతృత్వంలో పోరాడుతామని పేర్కొన్నారు.

అంతా ముందుగానే ప్లాన్.. ఒకరి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారం, జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక అ‍త్యాచార కేసు వివరాలను వెల్లడించిన సీపీ సీవీ ఆనంద్

జూబ్లీహిల్స్‌లో బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలికపై అఘాయిత్యానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలను (Amnesia Pub Rape Videos) ఎమ్మెల్యే రఘునందన్‌ ఈ నెల 4న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనలో బాధితురాలి వివరాలను ఎక్కడా వెల్లడించని తనపై కేసు ఎలా నమోదు చేశారో చెప్పాలని రఘునందన్‌రావు ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను ప్రశ్నించారు. తాను ఎక్కడ కూడా బాధితురాలి ఫొటో, వీడియో విడుదల చేయలేదని.. ఆమె పేరు, ఊరు, తల్లిదండ్రుల వివరాలు వెల్లడించలేదని స్పష్టం చేశారు