Speed limit of 120 kmph enforced on Hyderabad ORR; guidelines issued

హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై నేటి నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త స్పీడ్ లిమిట్స్ సంబంధించి సైబరాబాద్ పోలీసులు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. స్పీడ్ లిమిట్ ను తాజాగా 120 కిలోమీటర్లకు పెంచారు.

ఇంతకుముందు అత్యధిక స్పీడ్ లిమిట్ 100 కిలోమీటర్లుగా ఉండేది. నిర్దేశిత వేగానికి మించి వెళితే జరిమానా విధించేవారు. అయితే తాజాగా వేగ పరిమితిని 120 కిలోమీటర్లకు పెంచారు. ఔటర్ రింగ్ రోడ్డుపై టూ వీలర్స్, పాదచారులకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.

466 ఎమర్జెన్సీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం కేసీఆర్‌, అమ్మ ఒడి, అంబులెన్స్‌, పార్థివదేహాల తరలింపు వాహనాలు లాంచ్

ఔటర్ రింగ్ రోడ్డుపై నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ రూల్స్

లేన్ 1 అండ్ 2 లో 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్

లేన్ 3 అండ్ 4 లో 80 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్

ఐదవ లేన్ లో 40 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్

40 కిలోమీటర్ల స్పీడ్ కన్నా తక్కువ వెళ్లే వాహనాలకు అనుమతి లేదు